ఆదివారం జరిగిన యాషెస్ చివరి టెస్టులో 42 ఏళ్ల వికెట్ల రికార్డు బద్దలైంది. యాషెస్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు (29) తీసిన ఆసీస్ బౌలర్‌గా ప్యాట్ కమిన్స్ ఘనత సాధించాడు. అయితే ఇందులో ఒక్క సారి కూడా 5 వికెట్లు తీయకపోవడం విశేషం. 19.63 సగటుతో 29 వికెట్లు తీశాడు కమిన్స్, 1977-78 సీజన్లో ఆసీస్ మాజీ బౌలర్ వేన్ క్లార్క్ 28 వికెట్లతో ఇప్పటివరకు ముందు ఉన్నాడు.
ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు కమిన్స్. విదేశీ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన కంగారూ బౌలర్లలో కమిన్స్ రెండో స్థానంలో ఉన్నాడు. మెక్‌గ్రాత్ 2001లో ఇంగ్లాండ్‌పై 32 వికెట్లు తీసి ముందున్నాడు.