2020 ఐపీఎల్ కోసం ట్రేడింగ్ విండో సమయం ముగిసింది. అన్ని జట్లు కొందరు ఆటగాళ్లను తమవద్దే అంటిపెట్టుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ పార్థివ్ పటేల్‌ను కొనసాగించింది. దీనిపై ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెసన్ ట్వీట్ చేశాడు. "ఐపీఎల్ 2020 కోసం మీరంతా జట్టులో ఉండటం బాగుంది." అని అన్నాడు.
ఈ ట్వీట్‌కు "పార్థివ్‌ను అట్టిపెట్టుకున్నారా..?" అంటూ వ్యాఖ్యాత డీన్ జోన్స్ రిప్లే ఇచ్చాడు. అతడి వ్యాఖ్యలో వెటకారం దాగుండటం వల్ల పార్థివ్ నేరుగా స్పందించాడు. "మీరు కాస్త ప్రశాంతంగా ఉంటారని..." అంటూ ఘాటుగానే పంచ్ ఇచ్చాడు. ఐపీఎల్ కెరీర్‌లో 139 మ్యాచులాడిన అతడు 22.60 సగటుతో 2,848 పరుగులు చేశాడు. 13 అర్ధశతకాలు పార్థివ్ ఖాతాలో ఉన్నాయి.