తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అదే ధోనీ, కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీల్లో తేడా'

భారత క్రికెటర్లు కోహ్లీ, ధోనీ, రోహిత్​ శర్మ కెప్టెన్సీలపై ఆర్సీబీ వికెట్​ కీపర్​, బ్యాట్స్​మన్​ పార్థివ్​ పటేల్​ స్పందించాడు. కోహ్లీ సారథ్యం ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని, ఆటగాడి నుంచి ఏం రాబట్టుకోవాలనే విషయాలు మహీకి బాగా తెలుసని వివరించాడు.

parthiv patel explain about rohit, dhoni, kohli's captaincy
ఆటగాళ్లను కోహ్లీ మునివేళ్లపై నిలబెడతాడు:పార్థివ్​ పటేల్​

By

Published : Jun 28, 2020, 8:23 PM IST

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ ప్రత్యేకంగా ఉంటుందని, ఆటగాళ్లను ఎప్పుడూ మునివేళ్లపై నిలబెడతాడని ఆర్సీబీ వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ పార్థివ్‌ పటేల్‌ అన్నాడు. ఎప్పుడూ ముందుండి జట్టును నడిపించాలనుకోవడమే కాక, చాలా దూకుడుగా ఉంటాడని చెప్పాడు. అదే కోహ్లీ నైజమని, అది తనకి సరిగ్గా సరిపోతుందని స్పష్టం చేశాడు. మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌చోప్రా యూట్యూబ్‌ ఛానెల్‌లో ఆదివారం మాట్లాడిన పార్థివ్‌ పటేల్‌.. ఈ సందర్భంగా కోహ్లీ, ధోనీ, రోహిత్‌ శర్మ కెప్టెన్సీలపై తన అభిప్రాయాలు వెల్లడించాడు.

ధోనీ

"ధోనీ, రోహిత్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ను ప్రశాంతంగా ఉంచుతారు. కానీ విరాట్‌ ప్రతి ఆటగాడిని మునివేళ్లపై నిలబెట్టి ప్రోత్సహిస్తుంటాడు. ఇక ధోనీ విషయానికొస్తే.. ప్రతి ఆటగాడి సామర్థ్యం, వారి నుంచి ఏం రాబట్టుకోవాలనే విషయాలపై మహీకి పూర్తి సమాచారం ఉంటుంది. ఆ విధంగానే వారి ప్రతిభను బయటకు తీసుకొస్తాడు. క్రికెటర్లను తమ సహజసిద్ధమైన ఆట ఆడేలా వదిలేస్తాడు. అలా వారికి మంచి వేదిక ఏర్పాటు చేసి తమ ప్రతిభ చాటుకునే అవకాశం కల్పిస్తాడు."

పార్థివ్​ పటేల్​, టీమ్​ఇండియా క్రికెటర్​

రోహిత్‌ కూడా కెప్టెన్‌గా మంచి ప్రణాళికలు రూపొందిస్తాడని పార్థివ్​ తెలిపాడు. ప్రత్యర్థుల గురించి తెలిసిన సమాచారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఏ ఆటగాడిని ఎలా వినియోగించుకోవాలన్న విషయాలపై సరైన ఆలోచనా విధానం ఉంటుందని పేర్కొన్నాడు. 2014 నుంచి ఇప్పటివరకు రోహిత్​ను గమనిస్తే ఆటగాళ్లను ఎలా ఉపయోగించుకుంటున్నాడనే విషయం తెలుస్తుందని వెల్లడించాడు.

రోహిత్​ శర్మ

ఇదీ చూడండి...హిట్​మ్యాన్​ అరంగేట్రానికి 13 ఏళ్లు ​

ABOUT THE AUTHOR

...view details