తెలంగాణ

telangana

ETV Bharat / sports

పపువా న్యూగినియాకు వన్డే హోదా​ - icc

పపువా న్యూగినియా క్రికెట్​ జట్టుకు వన్డే హోదా లభించింది. తాజాగా ఒమన్​తో జరిగిన మ్యాచ్​లో విజయం సాధించడం వల్ల ఈ ఘనత సొంతం చేసుకుంది.

వన్డే హోదా​ అందుకున్న పపువా న్యూగినియా

By

Published : Apr 28, 2019, 6:35 AM IST

ఐసీసీ క్రికెట్​ వరల్డ్​ కప్​ లీగ్-​2 మ్యాచ్​లో సత్తా చాటింది పపువా న్యూగినియా. ఈ టోర్నీ ద్వారా ఇటీవలే అమెరికా, ఒమన్​ వన్డే హోదా దక్కించుకోగా... ఇప్పడు పపువా ఈ జాబితాలో చేరింది.

వరల్డ్​ క్రికెట్​ లీగ్​ డివిజన్- 2లో ఒమన్​తో జరిగిన మ్యాచ్​లో 155 పరుగుల తేడాతో గెలిచి ఈ ఘనత సాధించింది పుపువా జట్టు.

కెనడాకు నిరాశ...

ఈ లీగ్​ మ్యాచుల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు వన్డే హోదా లభిస్తుంది. అమెరికాతో జరిగిన మ్యాచ్​లో 40 పరుగుల తేడాతో కెనడా గెలిచింది. అయితే రన్​రేటు తక్కువగా ఉండటంతో అయిదో స్థానానికి పరిమితమై వన్డే హోదా పోగొట్టుకుంది.

ఐసీసీ క్రికెట్​ వరల్డ్​ కప్​ లీగ్​2...పాయింట్ల పట్టిక
  • నమీబియా 151 పరుగుల తేడాతో హాంకాంగ్​ను ఓడించి.. రెండో స్థానంలో నిలిచింది. ఫలితంగా వన్డే హోదా దక్కించుకుంది.

ఐసీసీ సీడబ్ల్యూసీ లీగ్-​2 మ్యాచుల్లో ఒమన్​, అమెరికా, స్కాట్లాండ్​, నేపాల్​, యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​, పుపువా న్యూగినియా, నమీబియా పోటీ పడనున్నాయి. ఈ దేశాలు రెండున్నర సంవత్సరాలలో 36 వన్డేలు ఆడనున్నాయి. ఈ రెండు సంవత్సరాలు జరిగే లీగ్​లో సత్తా చాటితే... 2023 పురుషుల క్రికెట్​ వరల్డ్​కప్​లో పాల్గొనేందుకు అవకాశం లభిస్తుంది.

2023 ప్రపంచకప్​కు అర్హత సాధించాలంటే...

ABOUT THE AUTHOR

...view details