రానున్న రోజుల్లో రిషభ్ పంత్ అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ఆటగాడిగా నిలుస్తాడని భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో శతకం చేసిన నేపథ్యంలో పంత్‌ను ట్విటర్ వేదికగా ప్రశంసించాడు.
"పంత్ ఎంతో చక్కగా ఆడాడు. ఒత్తిడిలోనూ సెంచరీ చేశాడు. రానున్న రోజుల్లో అన్ని ఫార్మాట్లలో గొప్ప ఆటగాడిగా నిలుస్తాడు. ఇదే జోరుతో ఆట కొనసాగించాలి."