తెలంగాణ

telangana

ETV Bharat / sports

పింక్ టెస్టులో రిషబ్​ పంత్​ బదులు భరత్ - india national cricket team

వెస్టిండీస్​ పర్యటన నేపథ్యంలో భారత క్రికెటర్ పంత్.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడనున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్​తో టెస్టు జట్టులో ఉన్న పంత్​ స్థానాన్ని కే.ఎస్.భరత్ భర్తీ చేయనున్నాడు.

పింక్ టెస్టు కోసం పంత్​ బదులు భరత్

By

Published : Nov 23, 2019, 9:50 AM IST

బంగ్లాదేశ్​తో డే/నైట్ టెస్టు ఆడుతున్న రిషబ్​ పంత్​ విషయంలో సెలక్షన్ కమిటీ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. టెస్టుకు బదులుగా దేశవాళీ లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడనున్నాడీ క్రికెటర్. త్వరలో వెస్టిండీస్​తో పరమిత ఓవర్ల మ్యాచ్​లు ఉన్న నేపథ్యంలో, బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పింక్ టెస్టు కోసం పంత్ స్థానంలో ఆంధ్ర క్రికెటర్ కే.ఎస్.భరత్ రానున్నాడు.

"పంత్.. వెస్టిండీస్​తో జరిగే ఆరు మ్యాచ్​లు (3 టీ20, 3 వన్డేలు) ఆడనున్నాడు. ఆలోపు దిల్లీ తరఫున సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో రిషబ్​ పాల్గొనేలా సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది" -బీసీసీఐ అధికారి

భారత్-ఏ తరఫున రెగ్యులర్​ ఆటగాడైన భరత్.. ఫస్ట్​క్లాస్ క్రికెట్​లో 69 మ్యాచ్​లాడి 3,909 పరుగులు చేశాడు. ఇందులో ఓ ట్రిపుల్ సెంచరీ, 8 శతకాలు, 20 అర్ధ శతకాలు ఉన్నాయి.

ఇది చదవండి: కెప్టెన్​గా వేగంగా 5 వేల మార్కు అందుకున్న విరాట్​

ABOUT THE AUTHOR

...view details