భారత యువ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్.. మైదానంలో ధోనీ నినాదాలు వినేందుకు అలవాటు పడాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. వాటిని వింటూనే ఒత్తిడి నుంచి బయటపడే మార్గం వెతకాలని సూచించాడు.
"ఆ నినాదాలు పంత్‌కు మంచివే. వాటికి అతడు అలవాటు పడాలి. అవి వింటూనే విజయవంతం కావడానికి దారి కనుక్కోవాలి. ఒత్తిడిని ఎదుర్కొంటూనే అతడు క్రికెట్లో తన ముద్ర వేయాలి. ప్రతిసారీ మనకు ఎంఎస్ ధోనీ అందుబాటులో ఉండడు. మహీ సాధించింది పంత్ సాధించాలంటే 15 ఏళ్లు పడుతుంది. భారత్‌కు అతడు చేసిన సేవలకు బీసీసీఐ కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు. అతడి వీడ్కోలు సంగతి పక్కన పెట్టండి. మేం విరాట్, సెలక్టర్లతో మాట్లాడుతున్నాం. సమయం వచ్చినప్పుడు వివరాలు చెప్తాం" - సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు