స్వదేశంలో ఆదివారం జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ప్రత్యర్థి టీమిండియాను 85 పరుగుల తేడాతో ఓడించి, కప్పు ఎగరేసుకుపోయింది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో ఓ తెలుగు పాట ప్లే కావడం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రపంచకప్‌లో 'పక్కా లోకల్' పాట, జై బాలయ్య నినాదాలు - jai balayya slogans
మహిళా ప్రపంచకప్ ఫైనల్లో తెలుగు పాటను ప్లే చేయడం సహా 'జై బాలయ్య' అంటూ నినాదాలు చేశారు కొందరు అభిమానులు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
![ప్రపంచకప్‌లో 'పక్కా లోకల్' పాట, జై బాలయ్య నినాదాలు ప్రపంచకప్‌లో 'పక్కా లోకల్' పాట, జై బాలయ్య నినాదాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6367166-242-6367166-1583909384288.jpg)
మెల్బోర్న్ క్రికెట్ మైదానం
మెల్బోర్న్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌ను చూసేందుకు 86,174 మంది వీక్షకులు హాజరయ్యారు. ఇందులో ఎక్కువ శాతం భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే 'జనతా గ్యారేజ్'లోని పక్కా లోకల్ పాట వేయడం వల్ల అభిమానులు డ్యాన్స్‌లు వేశారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇది చదవండి:నేటి నుంచి థియేటర్లు బంద్.. కరోనానే కారణం