తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్​లో పాక్​ రెండో అత్యల్ప స్కోరు - గేల్

ప్రస్తుత ప్రపంచకప్​లో వెస్టిండీస్​తో మ్యాచ్​లో రెండో అత్యల్ప స్కోరు(105) నమోదు చేసింది పాకిస్థాన్. 1992 వరల్డ్​కప్​లో ఇంగ్లండ్​పై 74 పరుగులకే ఆలౌటైందీ జట్టు.

ప్రపంచకప్​లో పాక్​ రెండో అత్యల్ప స్కోరు

By

Published : May 31, 2019, 7:22 PM IST

ట్రెంట్​బ్రిడ్జ్ వేదికగా జరిగిన ప్రపంచకప్​ మ్యాచ్​లో​ వెస్టిండీస్ చేతిలో పాక్​ ఘోరంగా ఓడిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన పాకిస్థాన్ 105 పరుగులు మాత్రమే చేయగలిగింది. 1992 వరల్డ్​కప్​ తర్వాత రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఆ ఏడాది ఆడిలైడ్​లో ఇంగ్లాండ్​పై 74 పరుగులకే ఆలౌటైంది.

ఈ మ్యాచ్​లో సమష్టిగా రాణించిన కరీబియన్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్​ నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలోనే చేధించింది. విధ్వంసక ఆటగాడు గేల్ అర్ధసెంచరీతో మెరిశాడు. బౌలర్లలలో థామస్ 4, హోల్డర్ 3, రసెల్ 2 వికెట్లు తీసి గెలుపులో కీలక పాత్ర పోషించారు.

పాక్ బ్యాట్స్​మన్ వికెట్ తీసిన ఆనందంలో విండీస్ బౌలర్

ఇది చదవండి: విండీస్​ ఘనవిజయం.. పాక్​కు తప్పని భంగపాటు

ABOUT THE AUTHOR

...view details