జింబాబ్వేపై మూడు టీ20ల సిరీస్‌ను పాకిస్థాన్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన ఆఖరిదైన మూడో టీ20లో పాక్ 8 వికెట్ల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. ఉస్మాన్ ఖదీర్ (4/13), ఇమద్ వసీం (2/27) ధాటికి మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్లకు 129 పరుగులే చేసింది. చిబాబా (31) టాప్ స్కోరర్.
జింబాబ్వేపై పాకిస్థాన్ క్లీన్‌స్వీప్ - పాకిస్థాన్ క్రికెట్
జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను పాకిస్థాన్ కైవసం చేసుకుంది. 3-0తో ప్రత్యర్థి జట్టును క్లీన్ స్వీప్ చేసింది. మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
అయ్యో జింబాబ్వే! క్లీన్‌స్వీప్ చేసేసిన పాకిస్థాన్
అరంగేట్ర ఆటగాడు షఫీఖ్ (41 నాటౌట్; 33 బంతుల్లో 4×4, 1×6)తో పాటు కుష్‌దిల్ షా (36 నాటౌట్; 15 బంతుల్లో 3×4, 3×6) రాణించడం వల్ల లక్ష్యాన్ని పాక్ 15.2 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి ఛేదించింది. అంతకుముందు కెరీర్‌లో ఆఖరి మ్యాచ్ ఆడుతున్న జింబాబ్వే ఆల్‌రౌండర్ ఎల్టాన్ చిగుంబుర పాక్ ఆటగాళ్ల నుంచి గౌరవ వందనాన్ని అందుకున్నాడు.
ఇదీ చూడండి:పాకిస్థాన్ టెస్టు కెప్టెన్‌గా బాబర్ అజామ్