తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టుల్లో పాక్ టీనేజర్ నసీమ్ రికార్డు హ్యాట్రిక్ - Youngest to take Test hat-trick

బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో హ్యాట్రిక్​ తీసిన నసీమ్.. ఈ ఫార్మాట్​లో తక్కువ వయసులోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్​గా నిలిచాడు.

టెస్టుల్లో పాక్ టీనేజర్ నసీమ్ రికార్డు హ్యాట్రిక్
పాక్ పేసర్ నసీమ్ షా

By

Published : Feb 9, 2020, 8:48 PM IST

Updated : Feb 29, 2020, 7:16 PM IST

పాకిస్థాన్ టీనేజ్ సంచలనం నసీమ్ షా.. టెస్టుల్లో రికార్డు సృష్టించాడు. తక్కువ వయసులోనే ఈ ఫార్మాట్​లో హ్యాట్రిక్​ తీసిన బౌలర్​గా నిలిచాడు. పాక్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్​ ఇతడు. బంగ్లాదేశ్​తో జరుగుతున్న తొలి టెస్టులో, 16 ఏళ్ల 11 నెలల 360 రోజుల్లోనే ఈ ఘనత సాధించాడు. నసీమ్ బౌలింగ్​లో వరుసగా హుస్సేన్ శాంటో(38), తైజుల్ ఇస్లామ్(0), మహ్మదుల్లా(0) పెవిలియన్ చేరారు.

ఈ మ్యాచ్​లో టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్​కు చేసిన బంగ్లాదేశ్.. 233 పరుగులకు ఆలౌట్​ అయింది. ఆ తర్వాత పాక్.. 445 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది.

రెండో ఇన్నింగ్స్​లో ప్రస్తుతం.. 6 వికెట్ల నష్టానికి 126 పరుగులతో ఉంది బంగ్లాదేశ్. మరో 86 పరుగులు చేస్తే, ఇన్నింగ్స్​ ఓటమి నుంచి ఈ జట్టు తప్పించుకోవచ్చు. క్రీజులో మొమినుల్ హక్(37), లిటన్ దాస్(0) ఉన్నారు.

Last Updated : Feb 29, 2020, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details