పాకిస్థాన్ యువ పేస్ బౌలర్ షహీన్ షా అఫ్రిది.. మాజీ స్టార్ షాహిద్ అఫ్రిదికి అల్లుడు కాబోతున్నాడు. అఫ్రిది తనయ అక్సాతో షహీన్ షాకు నిశ్చితార్థం జరగబోతోంది. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి జరగనుందని.. త్వరలోనే నిశ్చితార్థ కార్యక్రమం ఉంటుందని అఫ్రిది తెలిపాడు.
షాహిద్ అఫ్రిదికి అల్లుడవుతున్న పాక్ యువ బౌలర్ - షాహిద్ అఫ్రిది
పాకిస్థాన్ యువ బౌలర్ షహీన్ షా అఫ్రిది త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కుమార్తె అక్సాతో త్వరలోనే నిశ్చితార్థం జరగనుంది.
షాహిద్ అఫ్రిది అల్లుడవుతున్న షహీన్ షా
"గత కొన్ని నెలలుగా రెండు కుటుంబాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. మా అభ్యర్థనను అఫ్రిది కుటుంబం అంగీకరించింది" అని షహీన్ షా తండ్రి అయాజ్ చెప్పాడు. ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో అఫ్రిదితో కలిసి షహీన్ ఆడాడు. 20 ఏళ్ల ఈ కుర్రాడు ప్రస్తుతం పాక్ జట్టులో ప్రధాన పేసర్‌గా ఉన్నాడు.
ఇదీ చదవండి:ఐపీఎల్ 2021 భారత్‌లో.. అంతా బయటే