సిరీస్ ఆరంభ టెస్టులో బోణీ కొట్టిన ఇంగ్లాండ్‌తో పోటీకి సిద్ధమైంది పాక్. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచే సౌథాంప్టన్‌లో రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ అజహర్ అలీ.. మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ టెస్టులో పాక్ కచ్చితంగా నెగ్గితేనే సిరీస్ ఆశలు నిలబడనున్నాయి. ఇప్పటికే సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది ఇంగ్లీష్ జట్టు.
ఈ టెస్టులో ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కలేదు. బ్యాటింగ్ లైనప్‌ను కూడా పెంచుకునేందుకు మార్క్ వుడ్ స్థానంలో సామ్ కరన్‌కు తుది జట్టులో స్థానం లభించింది. ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ స్థానంలో జాక్ క్రావ్లేకు చోటిచ్చారు. కుటుంబ సమస్యల కారణంగా రెండు టెస్టులకు స్టోక్స్ అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్ యాజమాన్యం స్పష్టం చేసింది.
దాదాపు 11 ఏళ్ల తర్వాత మళ్లీ టెస్టు జట్టు తుది జాబితాలో చోటు దక్కించుకున్నాడు పాక్ సీనియర్ క్రికెటర్ ఫవద్ అలం.