వచ్చే ఏడాది భారత్లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. అయితే ఇందులో పాల్గొనేందుకు వీసాలు ఇస్తారో లేదో అనే విషయమై పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ఆలోచన మొదలైంది. ఇందులో ఆడే తమ ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి వీసాల మంజూరుపై హామీ ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు పీసీబీ సీఈవో వసీమ్ ఖాన్ వెల్లడించారు. ఏ ఇబ్బంది లేకుండా తమ క్రికెటర్లు ఆడేలా చూడాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకుని.. భారత ప్రభుత్వం, బీసీసీఐతో చర్చించాలని వసీమ్ ఖాన్ కోరారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ త్వరలోనే దీనిపై సమాధానమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.