కరాచీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ ఆటగాళ్లు అరుదైన రికార్డు నమోదు చేశారు. ఫలితంగా సుదీర్ఘ ఫార్మాట్లో టాప్-4 బ్యాట్స్మెన్లు శతకాలు చేసిన రెండో జట్టుగా ఘనత సాధించింది పాక్. 2007లో బంగ్లాదేశ్‌పై భారత ఆటగాళ్లు వసీం జాఫర్, దినేశ్ కార్తీక్, రాహుల్ ద్రవిడ్, సచిన్ తెందూల్కర్ శతకాలతో రికార్డు సృష్టించారు.
లంకతో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో.. మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 555 పరుగులు చేసింది పాకిస్థాన్. ఇందులో బాబర్ అజామ్(100*), అబిద్ అలీ(174), అజహర్ అలీ(118), షాన్ మసూద్(135) సెంచరీలు సాధించారు.