తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసోలేషన్ నుంచి పాకిస్థాన్ బృందానికి విముక్తి

దైపాక్షిక సిరీస్​ కోసం న్యూజిలాండ్​ వెళ్లిన పాకిస్థాన్ క్రికెట్​ బృందానికి ఐసోలేషన్​ నుంచి విముక్తి లభించింది. 14 రోజుల క్వారంటైన్​లో 12వ రోజు ఒక క్రికెటర్​ మినహా పాక్​ ఆటగాళ్లందరికీ కరోనా నెగటివ్​గా తేలింది. దీంతో నిర్బంధం నుంచి బయటకు వచ్చి పాక్​ బృందం శిక్షణ ప్రారంభించవచ్చని కివీస్​ ఆరోగ్య అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Pakistan team released from managed isolation in New Zealand
ఐసోలేషన్ నుంచి పాకిస్థాన్ బృందానికి విముక్తి

By

Published : Dec 8, 2020, 7:06 PM IST

న్యూజిలాండ్​ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్​లో పాల్గొనేందుకు పాకిస్థాన్​ జట్టును ఐసోలేషన్​ నుంచి బయటకు రావడానికి కివీస్​ ప్రభుత్వం అనుమతించింది. పాక్​ బృందం 14 రోజుల క్వారంటైన్​లో 12వ రోజు.. కరోనా పరీక్షల్లో నెగటివ్​గా తేలింది. దీంతో బృందంలోని 52 మందిని ప్రాక్టీసు కోసం సౌత్​ ఐలాండ్​ రిసార్ట్స్​కు వెళ్లేందుకు అనుమతినిచ్చారు. ప్రస్తుతం వారంతా అక్కడే శిక్షణ పొందొచ్చని తెలిపింది. వారిలో మరో ఆటగాడు కరోనా నుంచి పూర్తిగా కోలుకునే వరకు క్రైస్ట్​చర్చ్​లోని ఐసోలేషన్​లోనే ఉండాలని స్పష్టం చేసింది.

పాక్​ క్రికెటర్లకు కరోనా

53 మందితో కూడిన పాకిస్థాన్​ జట్టు న్యూజిలాండ్​ పర్యటనకు వచ్చింది. ఆ బృందంలో తొలుత ఇద్దరు ఆటగాళ్లకు కొవిడ్​ సోకినట్లు తేలగా.. మిగిలిన వారందరికీ నెగటివ్​గా వచ్చింది. దీంతో బృందంతో పాటు విడిగా ఇద్దర్ని క్వారంటైన్​ చేశారు. ఆ తర్వాత మరో ఆరుగురికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది.

పాకిస్థాన్​ క్రికెట్​ బృందం

నిబంధనల ఉల్లంఘన

ఇటీవలే న్యూజిలాండ్​ చేరుకున్న పాకిస్థాన్​ జట్టు క్వారంటైన్​ నియమాలను ఉల్లంఘించిందని కివీస్​ ఆరోగ్య అధికారులు ఆటగాళ్లకు హెచ్చరిక చేశారు. తాము తదుపరి ఆదేశం ఇచ్చే వరకు పాక్ క్రికెటర్లు నిర్బంధం నుంచి బయటకు రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

న్యూజిలాండ్​ ప్రసుతం వెస్టిండీస్​తో రెండు టెస్టుల సిరీస్​కు ఆతిథ్యం ఇస్తుంది. పాకిస్థాన్​తో డిసెంబరు 18, 20, 22 తేదీల్లో జరగనున్న టీ20 మ్యాచ్​లతో పాటు డిసెంబరు 26 నుంచి రెండు టెస్టుల సిరీస్​ ప్రారంభం కానుంది.

ABOUT THE AUTHOR

...view details