ప్రపంచకప్ సెమీస్ రేసు నుంచి వైదొలగిన దక్షిణాఫ్రికా.. ఆ ప్రయత్నంలో ఆపసోపాలు పడుతున్న పాకిస్థాన్.. నేడు లార్డ్స్ వేదికగా తలపడనున్నాయి. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. ఈ సీజన్లో లార్డ్స్ మైదానంలో జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదే.
ఇరుజట్లు చెరో మూడు పాయింట్ల సాధించి పాయింట్ల పట్టికలో దిగువన ఉన్నాయి. దక్షిణాఫ్రికా 8, పాకిస్థాన్ 9వ స్థానంలో ఉన్నాయి.
అభిమానుల నుంచి ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న పాక్.. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి తీరాలని భావిస్తోంది. ఆ జట్టులో బౌలర్ ఆమిర్ ఒక్కడే ఆకట్టుకుంటున్నాడు. విజయం దక్కాలంటే మిగతా వారు రాణించాల్సిన అవసరముంది.
ఈ ప్రపంచకప్‌లో నిరాశజనక ప్రదర్శన చేస్తోంది సఫారీ జట్టు. ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ చేతులెత్తేసింది. అద్భుతమైన క్రికెటర్లు ఉన్నా.. వారి స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్నారు. ఈ రోజైనా గెలిచి పరువు నిలుపుకుంటారా లేదా అనేది చూడాలి.