తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ముందు మీ దేశ భద్రత గురించి ఆలోచించండి' - మహిమ్ వర్మ

భారత్​లో భద్రతపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్​ ఎహెసన్ మణికి బీసీసీఐ.. గట్టి కౌంటర్ ఇచ్చింది. ముందు మీ దేశ భద్రత గురించి ఆలోచించాలంటూ మండిపడ్డారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ మహిమ్ వర్మ.

Pakistan
పాకిస్థాన్

By

Published : Dec 24, 2019, 3:10 PM IST

భద్రత విషయంలో భారత్​ను తక్కువ చేసి చూపించాలనుకున్న పాక్​ క్రికెట్​ బోర్డుకు బీసీసీఐ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆ విషయం మేం చూసుకుంటామని.. ముందు మీ దేశంలో భద్రతపై దృష్టిపెడితే బాగుంటుందంటూ బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ మహిమ్ వర్మ స్పష్టం చేశారు. అసలు తమ గురించి మీకెందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"మీ దేశ భద్రత గురించి ఆలోచించండి. మా దగ్గర పటిష్ఠమైన సెక్యూరిటీతో మ్యాచ్‌లు నిర్వహించుకునే సత్తా మాకు ఉంది. మాపై వ్యాఖ్యలు ఆపి మీ పని మీరు చూసుకుంటే మంచిది"
-మహిమ్‌ వర్మ, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్

స్వదేశంలోపాక్.. దశాబ్దం తర్వాత శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు సిరీస్‌లో విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్​ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇది విజయవంతం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, భద్రత విషయంలో భారత్​పై సంచలన వ్యాఖ్యలు చేశాడు పీసీబీ ఛైర్మన్ ఎహెసన్.

"శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌తో పాకిస్థాన్‌ సురక్షిత దేశమని నిరూపించాం. ఇంకా ఎవరికైనా అనుమానాలు ఉంటే ఇక్కడికి(పాక్‌) రండి మా భద్రతా ఎలా ఉందో చూపిస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో మా పొరుగు దేశమైన భారత్‌ కంటే పాక్‌ ఎంతో సురక్షితం. మరి భారత్‌కు వెళ్లి క్రికెట్‌ ఆడటానికి లేని భయం పాక్‌ రావడానికి ఎందుకు.?" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు మణి.

ఇవీ చూడండి.. చిన్నారులతో ధావన్ డ్యాన్స్​.. నెటిజన్ల ఫిదా

ABOUT THE AUTHOR

...view details