తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆసియా XIలో పాక్‌ ఆటగాళ్లు ఉండరు' - ఆసియా XI

ఆసియాXI, ప్రపంచ XI మధ్య బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రెండు మ్యాచ్​లు​ నిర్వహించనుంది. ఇందులో పాకిస్థాన్, భారత్ నుంచి ఆటగాళ్లు పాల్గొనాల్సి ఉంది. కానీ పాక్​ ఆటగాళ్లు ఆడరని బీసీసీఐ జాయింట్ సెక్రటరీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

Pakistan
బీసీసీఐ

By

Published : Dec 26, 2019, 6:30 PM IST

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు వచ్చే మార్చిలో ఆసియా XI, ప్రపంచ XI జట్లతో రెండు టీ20 మ్యాచ్‌లు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియా జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లు పాల్గొంటారని సమాచారం. అలాగే పాకిస్థాన్​ జట్టు నుంచి ఆటగాళ్లు పాల్గొనాల్సి ఉంది. కాగా ఈ విషయంపై బీసీసీఐ జాయింట్ సెక్రటరీ జయేష్ జార్జ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

"ఆసియా జట్టులో ఒక్క పాకిస్థాన్‌ క్రికెటర్‌ కూడా ఆడడనే స్పష్టమైన సమాచారం మా వద్ద ఉంది. ఇరు జట్ల మధ్య ఆటగాళ్లను ఎంపిక చేసే ప్రక్రియ ఉండదు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ భారత్‌ తరఫున ఆడే ఐదుగురి పేర్లను వెల్లడిస్తారు."
-జయేష్ జార్జ్, బీసీసీఐ జాయింట్ సెక్రటరీ

దీనిని బట్టి చూస్తే పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ ఎహ్సాన్ మణి భారత్​లో భద్రతపై చేసిన వ్యాఖ్యలను బీసీసీఐ సీరియస్​గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పదేళ్ల తర్వాత పాక్​లో టెస్టు సిరీస్‌ నిర్వహించడంపై స్పందిస్తూ ప్రస్తుతం పాకిస్థాన్‌లో కన్నా భారత్‌లోనే భద్రతాపరమైన అంశాలు సరిగ్గా లేవని సంచలన వ్యాఖ్యలు చేశాడు మణి.

ఇవీ చూడండి.. బాక్సింగ్​ డే టెస్టుకు రికార్డు వీక్షకుల హాజరు

ABOUT THE AUTHOR

...view details