లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందే ఆటగాళ్లు కరోనా బారిన పడుతున్నారు. నవంబర్ 26 నుంచి ఈ లీగ్ మొదలుకానుంది. పాకిస్థాన్ పేసర్ సొహైల్ తన్వీర్‌కు ఇప్పుడు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. లీగ్‌లోని కరోనా బారిన పడిన రెండో ఆటగాడు ఇతడు. కాండీ టస్కర్స్ తరఫున బరిలోకి దిగనన్న తన్వీర్‌కు వైరస్ సోకినట్లు ఆ జట్టు ప్రధాన కోచ్ హసన్ తిలకరత్నే చెప్పాడు. ఇటీవలే కెనడా ప్లేయర్ రవీందర్‌పాల్ సింగ్‌కు కరోనా పాటిజివ్‌గా తేలింది. వీరిద్దరూ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నారు. రవీందర్ కొలంబో కింగ్స్ తరఫున ఆడుతున్నాడు.
ఎల్పీఎల్ నిర్వాహకులకు షాక్.. మరో క్రికెటర్‌కు కరోనా - Lanka Premier League news
కరోనా బారిన పడుతున్న క్రికెటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లంక ప్రీమియర్‌కు ఈ సెగ తగిలింది. లీగ్ ప్రారంభానికి ముందే టోర్నీలో ఆడాల్సిన పాక్ బౌలర్ తన్వీర్ కొవిడ్ బారిన పడ్డాడు.
ఎల్పీఎల్ నిర్వాహకులకు షాక్.. మరో క్రికెటర్‌కు కరోనా
తన్వీర్ పలు మ్యాచ్‌లకు దూరమైనా సరే, పూర్తిగా కోలుకుంటేనే తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. గతంలో వాహబ్ రియాజ్, లియామ్ ప్లంకెట్లు టస్కర్స్ తరఫున ఆడాల్సి ఉన్నా.. కరోనా భయం వల్ల టోర్నీకి దూరమయ్యారు. వారి స్థానంలోనే జట్టులోకి వచ్చిన సోహైల్‌కు కొవిడ్-19 సోకింది.