తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత కెప్టెన్​ కోహ్లీలోని ప్రత్యేకత అదే' - ipl latest news

ప్రస్తుత సమయంలో ప్రపంచంలోనే అత్యుత్త బ్యాట్స్​మన్​ అంటే కోహ్లీనే అని పాక్​ పేసర్​ మహమ్మద్​ ఇర్ఫాన్ అన్నాడు. కోహ్లీ ఆడే విధానం ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు.

Pakistan pacer Mohammad Irfan terms India batsman as the 'best at the moment' in the world
కోహ్లీ

By

Published : Aug 15, 2020, 12:15 PM IST

టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీపై పాకిస్థాన్​ పేసర్​ మహమ్మద్​ ఇర్ఫాన్​ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోనే అతడు అత్యుత్తమ బ్యాట్స్​మన్​ అని చెప్పాడు. ఇటీవలే ఓ యూట్యూబ్​ ఛానెల్​ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలు తెలిపాడు.

2012లో జరిగిన వన్డే సిరీస్​లో పాక్​పై 2-1 తేడాతో భారత్ గెలుపొందింది. అయితే, బలహీన బౌలర్లపై దాడి చేయగల కోహ్లీ సామర్థ్యమే.. అతడ్ని విజయం వైపు నిలిచేలా చేసిందని ఇర్ఫాన్​ అన్నాడు.

మహమ్మద్​ ఇర్ఫాన్​

"కోహ్లీలో ఆడే విధానం చాలా భిన్నమైనది. ప్రతి బంతిని, బౌలర్లను అంచనా వేసుకుని ఆడటం అతడి ప్రత్యేకత. బలమైన బౌలింగ్​ దాడిలో 5,6 పరుగులు చేసి.. బలహీనమైన బౌలర్లపై మాత్రం విరుచుకుపడతాడు"

మహమ్మద్​ ఇర్ఫాన్​, పాకిస్థాన్​ పేసర్​

కరోనా ప్రభావంతో కోహ్లీ కూడా కొంతకాలం నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి జరగబోయే ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు.​ ఈ లీగ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుకు నాయకత్వం వహిస్తున్నాడు.

విరాట్​ కోహ్లీ

ABOUT THE AUTHOR

...view details