పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమిర్.. అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని పీసీబీ ధృవీకరించింది. న్యూజిలాండ్ పర్యటనకు తనను జట్టులోకి తీసుకోలేదనే కారణంతో ఆమిర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా పాక్ క్రికెట్ బోర్డుపై అసహనాన్ని వ్యక్తం చేశాడు.
"ప్రస్తుత పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో నేను కొనసాగలేను. మెంటల్ టార్చర్ కారణంగా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నా. నాకు ఇదొక మేలుకొలుపు వంటిది. వాళ్ల ప్రణాళికలలో నేను భాగం కాదలచుకోలేదు. అందుకే పక్కకు తప్పుకుందామని అనుకున్నా".