వెస్టిండీస్ జట్టుతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఓటమి పాలవడంపై పాకిస్థాన్ ఓపెనర్ షాన్ మసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేవలం ఒక మ్యాచ్లో ఓడిపోయినంత మాత్రాన ఇంగ్లీష్ జట్టు బలహీనమైందని కాదని పేర్కొన్నాడు. సౌతాంప్టన్లో నిర్వహించిన మొదటి టెస్టులో ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల తేడాతో విండీస్ చేతిలో ఓటమి చవిచూసింది. కరోనా వైరస్ కాలంలో జరిగిన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఇదే.
"దాదాపు మూడు నెలల తర్వాత ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. ఇందులో ఆతిథ్య జట్టు ఓటమిని అందరూ తప్పుబట్టడం స్పష్టంగా కనపడుతోంది. అయితే, ఇంగ్లీష్ జట్టు చాలా బలంగా ఉందని నేను భావిస్తున్నా. జో రూట్ కెప్టెన్గా తిరిగి వచ్చాగా.. బ్యాటింగ్ మరింత స్థిరంగా కనిపిస్తోంది."
-షాన్ మసూద్, పాకిస్థాన్ క్రికెటర్