వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్‌గేల్.. పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భద్రత విషయంలో ఆ దేశం అత్యంత సురక్షితమైనదని అన్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్న ఈ కరీబియన్ ఆటగాడు మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా చెప్పాడు.
"ప్రస్తుతం ప్రపంచంలో పాకిస్థాన్ అతి సురక్షితమైన ప్రాంతాల్లో ఒకటి. క్రికెటర్లకు ప్రెసిడెంట్ స్థాయిలో భద్రత కల్పిస్తామని చెబుతున్నారు. అంటే మనం సురక్షితమైన చేతుల్లో ఉన్నట్లే"
-గేల్, వెస్టిండీస్ క్రికెటర్