ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై వీలు చిక్కినప్పుడల్లా అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది పాకిస్థాన్. తాజాగా పాక్‌లో ఆడేందుకు పది మంది శ్రీలంక ఆటగాళ్లు అభ్యంతరం చెప్పగా.. ఇందుకు కారణం భారత్ అని విమర్శించారు ఆ దేశ మంత్రి ఫవాద్ హుస్సేన్ చౌదరి. తమ దేశంలో లంక ఆటగాళ్లు ఆడితే ఐపీఎల్ కాంట్రాక్టులను రద్దు చేస్తామని భారత్ బెదిరించినట్లు ట్వీట్ చేశారు.
"పాక్‌లో ఆడకూడదని శ్రీలంక ఆటగాళ్లను భారత్ బెదిరించినట్లు కొంత మంది వ్యాఖ్యాతలు నాకు చెప్పారు. ఒకవేళ ఆడితే వారి ఐపీఎల్ కాంట్రాక్టులను రద్దు చేస్తామని భయపెట్టారని తెలిసింది. ఇది నిజంగా చవకబారుతనం. పక్షపాత బుద్ధితో భారత క్రీడావర్గాలు దారుణంగా ప్రవర్తించాయి"