దాదాపు పదేళ్ల తర్వాత పాకిస్థాన్లో ఓ టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా శ్రీలంకతో తొలిటెస్టు బుధవారమే ప్రారంభమైంది. ఇదే జోరులో పాక్ బోర్డు మరో ముందుడగు వేసింది. వచ్చే నెలలో బంగ్లాదేశ్తో డే/నైట్ టెస్టు నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం ఆ దేశ బోర్డుకు ఓ ప్రతిపాదనను పంపింది. వారి నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది.
తమకు పంపిన ప్రతిపాదనపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) అధికారులు స్పందించారు. తమ ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత, వారంలోపు ఈ విషయంపై స్పష్టతనిస్తామని అన్నారు.