శ్రీలంకతో టెస్టు సిరీస్కు వేదికలను ప్రకటించింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ). రావల్పిండి, కరాచీ వేదికలుగా... డిసెంబరులో మ్యాచ్లు జరగనున్నాయి. దాదాపు 10 సంవత్సరాల తర్వాత పాక్ మళ్లీ టెస్టు సిరీస్కు ఆతిథ్యమిస్తోంది.
ఐసీసీ ఛాంపియన్షిప్లో భాగంగా శ్రీలంక-పాకిస్థాన్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్ జరగనుంది. డిసెంబర్ 11న తొలి టెస్టు, 19న రెండో టెస్టు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్లకు లంక వస్తే... జనవరిలో టీ20 సిరీస్కు బంగ్లాదేశ్ వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తుందని భావిస్తోంది.
ఉగ్రదాడి తర్వాత...
2009లో లాహోర్లో లంక జట్టుపై ఉగ్రదాడి జరిగింది. అప్పట్నుంచి ఏ దేశం దాయాది గడ్డపై కాలు మోపలేదు. ఈ ఏడాది సెప్టెంబర్లో దాదాపు దశాబ్ద కాలం తర్వాత టీ20లు, వన్డేలు ఆడేందుకు ఆ దేశం వెళ్లింది లంక జట్టు. అయితే ఈ పర్యటనకు ముందు లంక సీనియర్ క్రికెటర్లు పాక్ వెళ్లేందుకు నిరాకరించడం సంచలనమైంది. ఎట్టకేలకు ద్వితీయ శ్రేణి జట్టును పంపింది లంకబోర్డు. దాయాది దేశం వెళ్లి క్షేమంగా రావాలని లంక ఆటగాళ్లు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి.