సెలబ్రిటీల సోషల్‌మీడియా అకౌంట్లు వరుసగా హ్యాక్కావడం చర్చనీయాంశంగా మారుతోంది. రెండ్రోజుల క్రితం నటి పూజాహెగ్డే ఖాతా నుంచి సమంతపై అభ్యంతర పోస్టులు రాగా.. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్‌కు ఇలాంటి చిక్కులే ఎదురయ్యాయి. ఈసారి ఏకంగా అశ్లీల వీడియోలకు లైక్‌లు కొట్టాడు. ఈ విషయాన్ని శుక్రవారం ఆయనే స్వయంగా వెల్లడించారు. హ్యాకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
" నా సామాజిక మాధ్యమాల ఖాతాలు హ్యాక్ అయ్యాయి. వాటి నుంచి ఏదైనా పోస్టులు వస్తే పట్టించుకోవద్దు. ఇక జీవితంలో సోషల్‌మీడియా వాడకూడదని నిశ్చయించుకున్నా. ఇన్నిరోజులు నన్ను ఫాలో అయిన అభిమానులకు కృతజ్ఞతలు. నా నిర్ణయం మిమ్మల్ని బాధపెడితే క్షమించండి"