'ఐసీసీ టీమ్ ఆఫ్ ది డికెడ్' అవార్డుల్లో ఒక్కరంటే ఒక్క పాకిస్థాన్ క్రికెటర్ కూడా లేకపోవడం.. నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. యూనిస్ ఖాన్, మిస్బావుల్ హక్ వంటి పాక్ దిగ్గజ ఆటగాళ్లు కూడా ఇందులో చోటు దక్కించుకోకపోవడం గమనార్హం. అయితే.. ఈ విషయంలో పాక్ అభిమానులు అసహనానికి లోనవుతుండగా.. ఇతరులు మాత్రం ట్విట్టర్ వేదికగా పాకిస్థాన్ ఆటగాళ్లను తెగ ట్రోల్ చేస్తున్నారు.
పాపం పాక్.. ఒక్కరికీ చోటు దక్కలేదు! - మిస్బావుల్ హక్
ఈ దశాబ్దపు(2011-2020) ఉత్తమ జట్లను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఇందులో మూడు ఫార్మాట్లలోనూ భారత ఆటగాళ్లే జట్టుకు సారథ్యం వహిస్తుండగా.. ఏ ఒక్క పాకిస్థాన్ ఆటగాడు కూడా టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. దీనిపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ దశాబ్దపు అత్యుత్తమ టీ20, వన్డే, టెస్టు క్రికెట్ జట్లను ఆదివారం.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. వన్డే, టీ20 ఫార్మాట్లకు ఎంఎస్ ధోనీ సారథిగా, టెస్టు జట్టుకు కోహ్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. టీ20 జట్టులో ధోనీ, కోహ్లీతో పాటు ఓపెనర్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. అలాగే వన్డే ఫార్మాట్‌కు వెల్లడించిన జట్టులో ధోనీ, రోహిత్, కోహ్లీ చోటు సంపాదించారు. దశాబ్దపు టెస్టు జట్టులో భారత్ నుంచి కోహ్లీ, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు.
ఇదీ చూడండి:ఐసీసీ దశాబ్దపు ఉత్తమ జట్లకు కెప్టెన్‌గా ధోనీ, కోహ్లీ