పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ఉమర్ అక్మల్‌పై పాక్ క్రికెట్ బోర్డు జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది. అవినీతి నిరోధక కోడ్‌లోని పలు ఉల్లంఘనలకు పాల్పడినందున అతడికి నోటీసులు జారీ చేసింది. ఫిక్సింగ్‌కు సంబంధించిన విషయాలను ఉద్దేశపూర్వకంగా బోర్డు అవినీతి నిరోధక శాఖ అధికారులకు తెలియజేయనందున ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
పాక్ బ్యాట్స్‌మన్‌పై జీవితకాల నిషేధం?
అవినీతి నిరోధక కోడ్‌లోని పలు ఉల్లంఘనలకు పాల్పడినందున పాక్ బ్యాట్స్‌మన్ ఉమర్ అక్మల్‌కు నోటిసులు జారీ చేసింది పాక్ క్రికెట్ బోర్డు. మార్చి 31 లోపు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొంది.
పాక్ బ్యాట్స్‌మన్‌పై జీవితకాల నిషేధం?
మార్చి 31 లోపు లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని పేర్కొంది. ఒకవేళ అక్మల్ చెప్పే కారణాలతో పీసీబీ సంతృప్తి చెందకపోతే అతడిపై ఆరు నెలల నుంచి గరిష్ఠంగా జీవితకాల నిషేధం విధించే అవకాశం ఉంది.
ఇదీ చూడండి..'కైఫ్, యువీ లాంటి భాగస్వామ్యం అవసరం'