తెలంగాణ

telangana

By

Published : Aug 13, 2020, 6:48 PM IST

ETV Bharat / sports

11 ఏళ్ల తర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి పాక్​ క్రికెటర్​

పాక్ క్రికెటర్​ ఫవాద్​ ఆలమ్ టెస్టు క్రికెట్​లోకి రీఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్​లో ఆడుతున్నాడు. ఆగస్టు 13న సౌథాంప్టన్​ వేదికగా ఇంగ్లాండ్​తో ప్రారంభమైన రెండో టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు ఈ సీనియర్​ క్రికెటర్​.

Pakistan Cricketer fawad alam makes test comeback after 11 years
88 మ్యాచ్​ల తర్వాత మళ్లీ జట్టులోకి పాక్​ క్రికెటర్​

పాకిస్థాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ ఫవాద్‌ ఆలమ్‌ టెస్టుల్లోకి పునరాగమనం చేశాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత తెలుపు జెర్సీలో కనువిందు చేస్తున్నాడు. సౌథాంప్టన్​ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న రెండో టెస్టు తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు ఈ పాక్​ సీనియర్​ క్రికెటర్​. ఇది తన కెరీర్​లో నాలుగో టెస్టు మ్యాచ్​. ఈ కాలంలో మొత్తం 88 మ్యాచ్​లు మిస్సయ్యాడీ 34 ఏళ్ల దాయాది క్రికెటర్.

2019లో ఫస్ట్​క్లాస్​ టోర్నీ అయిన ఖ్వాయిద్​-ఇ-అజామ్​ ట్రోఫీలో డబుల్​ సెంచరీ చేయడం వల్ల మళ్లీ దశాబ్ద కాలం తర్వాత జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు ఫవాద్​.

గతంలో పాకిస్థాన్​కు చెందిన యూనిస్​ అహ్మద్​ 1987లో టెస్టుల్లో అరంగేట్రం చేశాక.. దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. ఇదే ఇప్పటికీ రికార్డుగా ఉంది.

ఆలమ్‌ చివరిసారి 2009లో డ్యునెడిన్‌లో న్యూజిలాండ్‌పై ఆడాడు. శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రదాడి రగడం వల్ల పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ నిలిచిపోయింది. 2009 జులైలో అతడు శ్రీలంకపై అరంగేట్రం చేసి శతకం బాదాడు. 16 ఏళ్ల తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 56.84 సగటుతో 12,222 పరుగులు సాధించాడు.

ABOUT THE AUTHOR

...view details