తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్ అజమ్​పై రేప్ కేసు! - బాబర్​ ఆజామ్​ వార్తలు

పాకిస్థాన్ కెప్టెన్​పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిందో మహిళ. తనను శారీరకంగా వేధించడం సహా గర్భవతిని కూడా చేశాడని మీడియా సమావేశంలో ఆమె పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్లు చెప్పింది.

Pakistan captain Babar Azam faces sexual abuse allegation
పాకిస్థాన్​ కెప్టెన్​పై లైంగిక వేధింపుల ఆరోపణ

By

Published : Nov 29, 2020, 11:57 AM IST

పాకిస్థాన్​ క్రికెట్​ జట్టు కెప్టెన్​ బాబర్​ అజామ్​పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. బాబర్​ పాఠశాల స్నేహితురాలినని చెప్తున్న ఓ మహిళ.. సదరు ఆటగాడు​​ తనను 10 ఏళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడని శనివారం మీడియా సమావేశంలో వెల్లడించింది. 2010లో తనను వివాహం చేసుకుంటానని నమ్మించి, క్రికెటర్​గా పేరు తెచ్చుకున్న తర్వాత మోసం చేశాడని ఆరోపించింది.

పాక్​ కెప్టెన్​ బాబర్ ఆజామ్​ తనను 2010లో వివాహం చేసుకుంటానని చెప్పాడని, ఆ తర్వాత ఏడాదే కోర్టులో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డామని సదరు మహిళ తెలిపింది. అంతలోనే బాబర్​ మనసు మార్చుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

బాబర్ పాకిస్థాన్​ జట్టులోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో​ తాను ఆర్థికంగా మద్దతుగా నిలిచినట్లు ఈ సందర్భంగా ఆమె చెప్పింది. శారీరకంగా వేధించడం సహా తనను బెదిరించాడని ఆరోపించింది.

గర్భవతిని చేశాడు!

బాధితురాలు మాట్లాడుతున్న వీడియో క్లిప్​ను పాకిస్థాన్​ జర్నలిస్టు సాజ్ సాదిక్ ట్విట్టర్​లో పంచుకున్నారు. "అతడు(బాబర్) నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. గర్భవతిని కూడా చేశాడు. నన్ను చాలాసార్లు కొట్టడమే కాకుండా బెదిరించాడు" అని ఆమె బాబర్​పై ఆరోపణలు చేసింది.

పాక్​ కెప్టెన్​ బాబర్​ ఆజామ్​ ప్రస్తుతం న్యూజిలాండ్​ పర్యటనలో భాగంగా 14 రోజుల నిర్బంధంలో ఉన్నాడు. ఈ పర్యటనలో ఇరుజట్ల మధ్య మూడు టీ20లు, రెండు టెస్టులు జరగాల్సి ఉంది. ఇటీవలే పాక్ జట్టు మూడు ఫార్మాట్లకు కెప్టెన్​గా ఎంపికయ్యాడు.

ఇదీ చూడండి:ఆరుగురు పాకిస్థాన్​ క్రికెటర్లకు కొవిడ్ పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details