తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20ల్లో పాకిస్థాన్ రికార్డు.. తొలి జట్టుగా ఘనత - Pakistan vs Bangladesh

పొట్టి ఫార్మాట్​లో 150 మ్యాచ్​లాడిన తొలి జట్టుగా నిలిచింది పాకిస్థాన్. ప్రస్తుతం బంగ్లాదేశ్​తో టీ20 సిరీస్​ ఆడుతోంది.​

టీ20ల్లో పాకిస్థాన్ రికార్డు.. తొలి జట్టుగా ఘనత
పొట్టి ఫార్మాట్​లో 150 మ్యాచ్​లాడిన తొలి జట్టుగా నిలిచింది పాకిస్థాన్

By

Published : Jan 24, 2020, 4:24 PM IST

Updated : Feb 18, 2020, 6:12 AM IST

పాకిస్థాన్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో 150 మ్యాచ్​లాడిన తొలి జట్టుగా నిలిచింది. బంగ్లాదేశ్​తో​ జరుగుతున్న తొలి మ్యాచ్​లో పాల్గొని, ఈ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో కొనసాగుతోంది పాక్.

పాకిస్థాన్.. 2006 ఆగస్టులో ఇంగ్లాండ్​తో తొలి టీ20 ఆడింది. ప్రస్తుత మ్యాచ్​తో కలిపి మొత్తంగా 150 మ్యాచ్​ల్లో పాల్గొంది. ఇందులో 90 సార్లు గెలిచి, 55 సార్లు ఓడింది. మూడు టై, ఒకదానిలో ఫలితం తేలలేదు.

ఈ జాబితాలో తర్వాతి స్థానంలో ఉంది భారత్. ప్రస్తుతం ఐదో ర్యాంక్​లో ఉన్న మన జట్టు.. ఇప్పటివరకు 130 మ్యాచ్​లు ఆడింది. ఇందులో 82 గెలవగా, 44 ఓడింది. మిగిలిన నాలుగు టైగా ముగిశాయి. ప్రస్తుతం కివీస్​ పర్యటనలో ఉంది కోహ్లీసేన.

Last Updated : Feb 18, 2020, 6:12 AM IST

ABOUT THE AUTHOR

...view details