తెలంగాణ

telangana

ETV Bharat / sports

రజాక్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మహిళల ఆగ్రహం - abdul razak

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. పెళ్లైన తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు వివాదాస్పదమయ్యాయి.

రజాక్

By

Published : Jul 18, 2019, 8:20 PM IST

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్​ అబ్దుల్‌ రజాక్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. పాక్​లోని ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. "నేను సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నా. అనంతరం సుమారు ఐదారుగురు అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా. ఏడాదిన్నర కాలంలోనే ఇదంతా జరిగింది. ఇది నాకు ఏమాత్రం తప్పనిపించడం లేదు" అని రజాక్ అన్నాడు.

రజాక్ మాటలతో ఇంటర్వ్యూ చేసే యాంకర్, యూనిట్ సభ్యులతో పాటు ప్రేక్షకులూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ఎక్కడ ఏం మాట్లాడుతున్నావో అర్ధమవుతుందా? 'ఇప్పటివరకు గొప్ప ఆటగాడివనే గౌరవం ఉండేది. ఈ క్షణంతో అది పోయింది. రజాక్ ఇలాంటోడా?" అంటూ ట్రోల్ చేస్తున్నారు.

ఇంతకుముందు ప్రపంచకప్‌ జరుగుతుండగా.. టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రజాక్. పాండ్యను తనకు రెండు వారాలు అప్పగిస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతానని అన్నాడు. దీనిపై భారత అభిమానుల నుంచి విమర్శలూ ఎదుర్కొన్నాడు. అనంతరం టీమిండియా బౌలర్​.. మహ్మద్​ షమీ ముస్లిం కాబట్టే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఇవీ చూడండి.. ఆ సిక్స్​ చూసి ప్రాణాలు విడిచిన నీషమ్​ కోచ్​​

ABOUT THE AUTHOR

...view details