తెలంగాణ

telangana

ETV Bharat / sports

అరంగేట్రంలోనే నౌమన్​ 5 వికెట్లు- పాక్ గెలుపు - South Africa

పాకిస్థాన్​ పర్యటనలో ఉన్న సౌత్​ఆఫ్రికా జట్టు తొలి టెస్టులో 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. పాక్​ బౌలర్లు నౌమన్ అలీ, యాసిర్ షా ధాటికి సఫారీ జట్టు బెంబేలెత్తిపోయింది. లేటు వయసులో అరంగేట్రం చేసిన నౌమన్​ అలీ.. 5 వికెట్లతో పాక్​ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

PAK vs SA: Hosts thrash South Africa by seven wickets in 1st Test
అరంగేట్రంలోనే నౌమన్​ 5 వికెట్లు.. పాక్ గెలుపు

By

Published : Jan 29, 2021, 6:02 PM IST

స్పిన్నర్లు నౌమన్ అలీ, యాసిర్​ షా మెరుపులతో తొలి టెస్టును దక్కించుకుంది పాకిస్థాన్. 7 వికెట్ల తేడా శుక్రవారం ఆ జట్టు సౌత్​ఆఫ్రికాను ఓడించింది. దీంతో 2 మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది పాక్.

మరో స్పిన్నర్​ యాసిర్​ షాతో కలిసి రెండో ఇన్నింగ్స్​లో సఫారీ జట్టును 245కే కట్టిడి చేశాడు నౌమన్. 88 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 3 వికెట్లు కోల్పోయి అవలీలగా మ్యాచ్​ను దక్కించుకుంది.

సౌత్​ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్: 220

పాక్ తొలి ఇన్నింగ్స్​: 378

సౌత్​ఆఫ్రికా రెండో ఇన్నింగ్స్: 245

పాక్ రెండో ఇన్నింగ్స్: 90/3

నౌమన్ అదరహో..

వికెట్​ తీసిన ఆనందంలో నౌమన్

34 ఏళ్ల వయసులో పాక్ తరఫున అరంగేట్రం చేశాడు నౌమన్. తొలి ఇన్నింగ్స్​లో కీలకమైన ఎల్గర్, డి కాక్​ వికెట్లు తీసిన అతడు రెండో ఇన్నింగ్స్​లో అయిదు వికెట్లతో సత్తా చాటాడు. దీంతో 72 సంవత్సరాల తర్వాత అరంగేట్రంలో ఐదు వికెట్లు తీసిన లేటు వయసు క్రికెటర్​గా నిలిచాడు.​ నౌమన్​పై సహచరులు సహ మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రావల్పిండిలో రెండో టెస్టు ఫిబ్రవరి 4న ప్రారంభంకానుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు మూడు టీ20 మ్యాచ్​ల సిరీస్​ జరుగుతుంది.

ఇదీ చూడండి:హోటల్​ గదిలో చెమటలు చిందిస్తున్న విరాట్

ABOUT THE AUTHOR

...view details