పాకిస్థాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు తాత్కాలిక సారథిగా ఎంపికయ్యాడు దక్షిణాఫ్రికా ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్. అతడు కెరీర్లో తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది.
పాకిస్థాన్‌తో దక్షిణాఫ్రికా.. రెండు టెస్టులు(జనవరి 26-ఫిబ్రవరి 8), మూడు టీ20లు(ఫిబ్రవరి 11-14) ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఆసీస్‌తో జరిగే సిరీస్ కోసం సఫారీ జట్టు ముందుగా క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. ఇందులో భాగంగానే ముందస్తుగానే సారథి క్వింటన్ డికాక్.. పాక్‌తో టెస్టులు ముగియగానే అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి వస్తాడు. ఆ తర్వాత ఆసీస్ పర్యటనకు సిద్ధమౌతాడు. అందుకే డికాక్‌కు బదులుగా టీ20లకు సారథిగా హెన్రిచ్ ఎంపికయ్యాడు.