తెలంగాణ

telangana

ETV Bharat / sports

దేశవాళీల్లో ఆడుకో.. సర్ఫరాజ్​కు ఇమ్రాన్ సూచన

ప్రపంచకప్​ తర్వాత జాతీయ జట్టులో స్థానంతో పాటు సారథ్య బాధ్యతలూ కోల్పోయిన పాక్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్. ఈ ఆటగాడికి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓ సలహా ఇచ్చారు. దేశవాళీల్లో రాణించి జట్టులోకి రావాలని సూచించారు.

ఇమ్రాన్

By

Published : Nov 18, 2019, 4:36 PM IST

ప్రపంచకప్​లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది పాకిస్థాన్ క్రికెట్ జట్టు. ఆ తర్వాత వారిపై ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తాయి. కోచ్​తో పాటు కెప్టెన్​ను తొలగించిన పీసీబీ.. జట్టును మళ్లీ గాడినపెట్టేందుకు శ్రమిస్తోంది. అయితే కెప్టెన్సీ కోల్పోయి, జట్టుకూ దూరమైన సర్ఫరాజ్​ అహ్మద్​కు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. దేశవాళీ క్రికెట్​ ఆడుకోమంటూ సలహా ఇచ్చారు.

"టీ20 ప్రదర్శన ఆధారంగా ఒక ఆటగాడిని అంచనా వేయలేం. టెస్టు, వన్డే క్రికెట్‌ వల్లే ఓ క్రికెటర్​ ప్రదర్శన బయటకొస్తుంది. ముందుగా సర్ఫరాజ్‌.. దేశవాళీ క్రికెట్‌పై దృష్టిసారించాలి. జాతీయ జట్టులోకి రావాలంటే ఆ మ్యాచ్‌ల్లో ఉత్తమ ప్రదర్శన అవసరం."

-ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ ప్రధాని

పాక్ జట్టుకు ప్రస్తుత ప్రధాన కోచ్‌, చీఫ్‌ సెలక్టర్‌గా ఎంపికైన మిస్బావుల్‌ హక్‌కు ఇమ్రాన్‌ కితాబిచ్చారు. కోచ్‌గా ఈ మాజీ క్రికెటర్ అన్ని విధాలుగా అర్హుడని అన్నారు. అతడొక అత్యుత్తమ ఆటగాడు కావడం, ప్రస్తుత జట్టులోని క్రికెటర్లకు కలిసొస్తుందని చెప్పారు.

ఇవీ చూడండి.. అశ్విన్.. ఈ సారి జయసూర్యలా బౌలింగ్​

ABOUT THE AUTHOR

...view details