తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత క్యాబ్ డ్రైవర్​కు పాక్ క్రికెటర్లు విందు

ఐదుగురు పాకిస్థాన్ క్రికెటర్లు, ఓ భారత క్యాబ్ డ్రైవర్​కు విందు ఇచ్చారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని​ బ్రిస్బేన్​లో జరిగింది. ఏబీసీ రేడియో వ్యాఖ్యాత అలిసన్‌ మిచెల్‌, ఈ విషయాన్ని ఆసీస్‌ మాజీ పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌కు లైవ్‌లో తెలియజేసింది.

భారత క్యాబ్ డ్రైవర్​కు పాక్ క్రికెటర్లు విందు

By

Published : Nov 25, 2019, 11:00 PM IST

పాకిస్థాన్‌ క్రికెటర్లు ఓ భారత క్యాబ్‌ డ్రైవర్‌కు విందు ఇచ్చిన సంఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆసీస్‌లో పర్యటనలో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు.. బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టులో ఓడింది. అనంతరం ఐదుగురు పాక్‌ క్రికెటర్లు.. తాము దిగిన హోటల్‌ నుంచి ఓ క్యాబ్‌ బుక్‌ చేసుకొని భారత రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ క్యాబ్‌ డ్రైవర్‌ వారిపై గౌరవంతో డబ్బు తీసుకోలేదు.

క్రికెటర్లు షాహిన్‌ షా, యాసిర్‌ షా, నసీమ్‌ షాలతో పాటు మరో ఇద్దరు ఆ డ్రైవర్‌ను తమ వెంట రెస్టారెంట్‌కు తీసుకెళ్లి విందు ఇచ్చారు. ఏబీసీ రేడియో వ్యాఖ్యాత అలిసన్‌ మిచెల్‌ ఈ విషయాన్ని ఆసీస్‌ మాజీ పేసర్‌ మిచెల్‌ జాన్సన్‌కు లైవ్‌లో తెలియజేసింది. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

అలిసన్‌ మిచెల్‌కు ఈ విషయాన్ని స్వయంగా ఆ క్యాబ్‌ డ్రైవరే చెప్పాడట. ఆమె.. అదే క్యాబ్‌లో ఆసీస్‌-పాక్‌ టెస్టు కోసం స్టేడియానికి వస్తుంటే డ్రైవర్‌ తన సంతోషాన్ని పంచుకున్నాడని చెప్పింది.

ఆదివారం పూర్తయిన తొలి టెస్టులో ఆసీస్‌, ఇన్నింగ్స్‌ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది.డేనైట్‌గా జరిగే రెండో టెస్టు.. శుక్రవారం ఆడిలైడ్‌లో జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details