తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ10 లీగ్​కు పాక్​ దూరం.. ఆటగాళ్లకు ఆదాయం కట్​! - Pakistan Cricket Board Revoke Permissions for T10 League

అబుదాబి వేదికగా జరగనున్న టీ10 లీగ్‌కు పాక్‌ జట్టు దూరమవ్వడం వల్ల ఆ దేశ ఆటగాళ్లు భారీ ఆదాయం కోల్పోనున్నారు. నవంబర్ 15 నుంచి 24 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఈ లీగ్​లో పాల్గొంటే తమ క్రికెటర్లకు పనిభారం పెరుగుతుందని ఇటీవల అనుమతి నిరాకరించింది పాకిస్థాన్​ క్రికెట్ బోర్డు.

పాక్​ ఆటగాళ్లకు టీ10 మిస్​.. ఆదాయంలో కోటి తుస్​​

By

Published : Oct 26, 2019, 7:00 AM IST

వచ్చే నెలలో అబుదాబిలో జరగనున్న టీ10 లీగ్‌ నుంచి పాక్‌ ఆటగాళ్లు తప్పుకోవడం వల్ల వారందరూ భారీగా నష్టపోనున్నారు. టీ10 క్రికెట్‌కు తొలుత పాక్‌ ఆటగాళ్లకు అనుమతిచ్చింది పీసీబీ. కానీ ఈ మ్యాచ్​ల్లో పాల్గొంటే క్రికెటర్లుకు పనిభారం అధికమవుతుందనే ఉద్దేశంతో తర్వాత ఆ అనుమతిని ఉపసంహరించుకుంది.

ఈ నిర్ణయం కారణంగా షోయబ్‌ మాలిక్‌, అమిర్‌ వంటి టాప్‌ పాక్‌ ఆటగాళ్లు వ్యక్తిగతంగా కోటి రూపాయల మేర ఆదాయాన్ని కోల్పోనున్నారు. అంతేకాకుండా ఫ్రాంఛైజీలకు కూడా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. గతేడాది టీ10 లీగ్‌లో పాక్‌ ఆటగాళ్లకు అనుమతిచ్చినందుకు లీగ్‌ నిర్వాహకులు.... పీసీబీకి సుమారు 6 లక్షల మిలియన్ల డాలర్లు చెల్లించారని సంబంధిత వర్గాల సమాచారం.

యువీ సిద్ధం...

నవంబర్‌ 15 నుంచి మొదలవనున్న ఈ పొట్టి ఫార్మాట్‌ టోర్నీలో ఎనిమిది జట్లు తలపడతాయి. ఈ ఏడాది జూన్​లో అనూహ్యంగా క్రికెట్​కు వీడ్కోలు పలికిన యువరాజ్.. విదేశాల్లో జరుగుతున్న టీ20 లీగ్​ల్లో ఆడతానని అప్పుడే ప్రకటించాడు. కెనడా టీ20లీగ్​లో టొర్నడో నేషనల్స్ తరపు న ప్రాతినిధ్యం వహించాడు యువీ. ఈ టోర్నీలో మరాఠే అరేబియన్స్‌ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈ జట్టుకు డ్వేన్‌ బ్రావో సారథి.

యువరాజ్​ సింగ్​

ప్రముఖ క్రికెటర్లు లసిత్‌ మలింగ, హజ్రతుల్లా జజాయ్‌, నజీబుల్లా జర్దాన్‌, క్రిస్‌ లిన్‌ ఇదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మూడో సీజన్‌లో పాక్​ నుంచి షాహిద్‌ అఫ్రీది మాత్రం బరిలోకి దిగనున్నాడు. అఫ్రీది కలందర్స్ జట్టు తరఫున ఆడనున్నాడు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details