తెలంగాణ

telangana

ETV Bharat / sports

'గంగూలీ కన్నా ఉత్తమ సారథులు రాలేదు' - గంగూలీపై అక్తర్​ ప్రశసుల

టీమిండియా మాజీ క్రికెటర్​ సౌరభ్​ గంగూలీపై ప్రశంసలు కురిపించాడు పాక్​ మాజీ పేసర్ షోయబ్​ అక్తర్​. భారత జట్టుకు అతడి కంటే ఉత్తమ సారథులు రాలేదని అన్నాడు.

shoyab aktar
షోయబ్​ అక్తర్​

By

Published : Jun 11, 2020, 6:35 AM IST

టీమ్‌ఇండియా మాజీ సారథి సౌరభ్‌ గంగూలీపై పాకిస్థాన్‌ మాజీ బౌలర్ షోయబ్‌ అక్తర్‌ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టుకు నాయకత్వం వహించిన వాళ్లలో గంగూలీ అంటేనే తనకు చాలా ఇష్టమని వెల్లడించాడు.

"నాకు నచ్చిన భారత కెప్టెన్‌ గంగూలీ. ఆ జట్టు నుంచి అంతకంటే ఉత్తమ నాయకులు రాలేదు. సారథిగా ధోనీ కూడా మంచి ప్రదర్శనే చేశాడు. కానీ దాదా జట్టు స్వరూపాన్నే మార్చేశాడు. 1990ల్లో ఆ జట్టు మాపై పెద్దగా గెలవడం నేను చూడలేదు. కానీ 2000లో గంగూలీ కెప్టెన్‌ అయ్యాక ఆ జట్టు పాక్‌ను ఓడిస్తుందని అనుకున్నా. అలాగే జరిగింది. టీమ్‌ఇండియాలో అతను గొప్ప మార్పు తెచ్చాడు. గంగూలీ ఓ పిరికివాడు, నా బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి భయపడతాడని చాలా మంది భావించారు. కానీ నా కెరీర్‌లో నేను బౌలింగ్‌ చేసిన అత్యంత ధైర్యవంతుడైన బ్యాట్స్‌మన్‌ అతనే. అతను ఎక్కువ షాట్లు ఆడలేకపోవచ్చు. అతని ఛాతీకి గురిపెట్టి నేను చాలా సార్లు బంతులేశా. అయినప్పటికీ ఓపెనర్‌గా దిగి.. ఓ యోధుడిలా నా బౌలింగ్‌ను ఎదుర్కొని పరుగులు సాధించాడు. బెంగాలీ ప్రజలు మంచి ప్రోత్సహాన్ని అందిస్తారు. నాయకులుగా ముందుండి నడిపిస్తారు. గంగూలీ కూడా అంతే. వాళ్లంటే నాకు ప్రేమ"

-అక్తర్, పాక్​ మాజీ పేసర్​.

ఇది చూడండి : టీ20 ప్రపంచకప్ నిర్వహణపై జులైలో తుది నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details