తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఓవర్​ త్రో నియమంపై చర్చ సాధ్యమే' - over throw decision in mcc

ప్రపంచకప్​ ఫైనల్లో ఓవర్​త్రో కారణంగా ఇంగ్లాండ్​కు​ ఆరు పరుగులు కలిసివచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ నిబంధన బాగా చర్చనీయాంశమైంది. పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఈ అంశంపై మెరిల్​బోర్న్​ క్రికెట్​ క్లబ్​(ఎం​సీసీ)లో త్వరలో చర్చ జరగనుంది. క్రికెట్​ రాజ్యాంగానికి ఈ క్లబ్​ పర్యవేక్షణ బాధ్యతలు చూస్తోంది.

over throw decision in mcc

By

Published : Aug 13, 2019, 6:09 PM IST

Updated : Sep 26, 2019, 9:37 PM IST

ఇంగ్లాండ్‌లో జ‌రిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో వివాదాస్ప‌దంగా మారిన ఓవ‌ర్‌త్రోపై ఎంసీసీ(మెరిల్​బోర్న్​ క్రికెట్​ క్లబ్​) వ‌ర‌ల్డ్ క్రికెట్ క‌మిటీ త్వరలో స‌మీక్షించ‌నుంది. ఉత్కంఠగా జ‌రిగిన ఫైన‌ల్లో న్యూజిలాండ్​ ఫీల్డర్​ గప్తిల్​ విసిరిన బంతి... ఇంగ్లీష్​ బ్యాట్స్​మెన్​ బెన్‌స్టోక్స్ బ్యాట్‌కు త‌గిలి బౌండ‌రీ వెళ్లింది. ఫలితంగా అంపైర్లు దాన్ని ఓవ‌ర్‌త్రో కింద పరిగణించి పరుగులు ఇచ్చారు. ఫలితంగా మ్యాచ్​ టై అయి సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది. ఆ త‌ర్వాత సూప‌ర్ ఓవ‌ర్​ కూడా డ్రా అవడం వల్ల బౌండ‌రీ కౌంట్​ ఆధారంగా ఇంగ్లండ్‌ విజేత‌గా ఆవిర్భవించింది.

ప్రపంచకప్​ ఫైనల్లో సూప‌ర్ ఓవ‌ర్‌కు కారణమైన ఓవ‌ర్‌త్రో నిబంధన గురించి వ‌ర‌ల్డ్ క్రికెట్ క‌మిటీ ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న స‌మావేశంలో స‌మీక్షించ‌నుంది. డబ్ల్యూసీసీ(వరల్డ్​ క్రికెట్​ కమిటీ) ప్యాన‌ల్‌లో ఉన్న మాజీ క్రికెట‌ర్లు షేన్ వార్న్‌, కుమార సంగ‌క్క‌ర‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

  1. ఓవ‌ర్‌త్రో గురించి వివరిస్తోన్న ఐసీసీ 19.8 నియ‌మావ‌ళిని పరిశీలించనున్నారు. వీటితో పాటు అంపైర్ల తప్పుడు నిర్ణయాలు మ్యాచ్​ స్వరూపాన్ని మార్చేస్తున్నాయన్న విషయంపైనా చర్చించనున్నారు.
  2. 2028 ఒలింపిక్స్​లో క్రికెట్​ను చేర్చే అంశం, వరల్డ్​కప్​లో ఐపీఎల్​ తరహా ప్లే ఆఫ్స్​ నిర్వహణ, ఎవరికైనా ఆటగాడికి దెబ్బతగిలితే ప్లేయ‌ర్​ రిప్లేస్‌మెంట్ చేసే అవకాశంపైనా సమాలోచనలు చేయనున్నారు.

ఇంగ్లాండ్ మాజీ​ క్రికెటర్​ మైక్​ గ్యాటింగ్​ అధ్యక్షతన ఎమ్​సీసీ వరల్డ్​ క్రికెట్​ కమిటీ రెండు రోజుల సమావేశం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి భారత జట్టు మాజీ కెప్టెన్​ సౌరవ్​ గంగూలీ హాజరవ్వాల్సి ఉన్నా.. వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నట్లు ఇదివరకే ప్రకటించాడు.

ఇవీ చూడండి...కామన్​వెల్త్​ గేమ్స్​లో టీ-20 క్రికెట్​

Last Updated : Sep 26, 2019, 9:37 PM IST

ABOUT THE AUTHOR

...view details