తెలంగాణ

telangana

By

Published : Dec 18, 2019, 1:57 PM IST

Updated : Dec 18, 2019, 3:47 PM IST

ETV Bharat / sports

విశాఖ వన్డేలో సత్తాచాటితే విరాట్ ఖాతాలో అరుదైన రికార్డులు

మరో 56 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 7వ బ్యాట్స్​మన్​గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టిస్తాడు. అంతేకాకుండా విశాఖ పిచ్​పై కోహ్లీ 139 సగటుతో 556 పరుగులు చేశాడు.

Over 50 in 2 years: Virat Kohli creates another world record
విశాఖ వన్డేలో సత్తాచాటితే విరాట్ ఖాతాలో అరుదైన రికార్డులు

అంతర్జాతీయ క్రికెట్లో తనదైన దూకుడుతో దూసుకెళ్తున్నాడు విరాట్ కోహ్లీ. ఇప్పటికే అత్యధిక శతకాలతో సచిన్ తర్వాత రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. విశాఖ వేదికగా వెస్టిండీస్​తో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించే అవకాశముంది.

సత్తాచాటితే కల్లిస్ రికార్డు బ్రేక్​..

మరో 56 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఏడో బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించనున్నాడు కోహ్లీ. 240 వన్డేల్లో 60.02 సగటుతో 11524 పరుగులు చేశాడు టీమిండియా సారథి. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాక్వస్ కలీస్ 328 మ్యాచ్​ల్లో 11579 పరుగులతో ముందున్నాడు. ఈ మ్యాచ్​లో కోహ్లీ సత్తాచాటితే కల్లిస్ రికార్డు బద్దలుకానుంది.

కోహ్లీకి కలిసొచ్చిన పిచ్​..

విశాఖ పిచ్​పై విరాట్ 139 సగటుతో బ్యాటింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు. మొత్తం 556 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. రెండు అర్ధశతకాలు(99, 65) ఉన్నాయి. ఈ ఏడాది మూడు ఫార్మాట్లలో కలిపి 2366 పరుగులు చేశాడు కోహ్లీ.

విరాట్ కోహ్లీ

హ్యాట్రిక్ సాధించే అవకాశం..

గత రెండేళ్లుగా వన్డేల్లో లీడింగ్ రన్​ స్కోరర్​గా ఏడాదిని ముగిస్తున్నాడు కోహ్లీ. 2017లో 1460 పరుగులు చేసిన విరాట్.. తర్వాతి సంవత్సరం 1202 పరుగులు చేశాడు. ప్రస్తుతం విండీస్​తో జరుగుతున్న వన్డే సిరీస్​లో సత్తాచాటితే కోహ్లీ హ్యాట్రిక్ సాధించే అవకాశముంది.

రెండేళ్లుగా 50కు పైగా సగటు..

అంతేకాకుండా గత రెండేళ్లుగా మూడు ఫార్మాట్లలో 50కు పైగా సగటుతో బ్యాటింగ్ చేస్తున్న బ్యాట్స్​మన్​గా విరాట్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం వన్డేల్లో కోహ్లీ సగటు 60.02 కాగా.. టెస్టుల్లో 54097, టీ20ల్లో 52.66 సగటుతో ఆకట్టుకుంటున్నాడు.

కోహ్లీ కాకుండా 50కు పైగా సగటుతో ఆడిన క్రికెటర్లు..

  1. మ్యాథ్యూహెడెన్(ఆస్ట్రేలియా)-2007
  2. ఆండ్రూ సైమండ్స్(ఆస్ట్రేలియా)- 2007
  3. కుమార సంగక్కర(శ్రీలంక)-2013
  4. స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా)- 2016
  5. కేఎల్ రాహుల్(భారత్)- 2016
  6. ఏబీ డివిలియర్స్(దక్షిణాఫ్రికా)- 2017

ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. హెట్మయిర్‌ (139), హోప్‌ (102*) విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇదీ చదవండి: టాస్ గెలిచిన విండీస్.. భారత్ బ్యాటింగ్​

Last Updated : Dec 18, 2019, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details