వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ 20 మ్యాచ్‌లో టాస్ ఆలస్యమైంది. ప్రావిడెన్స్ స్టేడియంలో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందే వరణుడు తెరపిచ్చాడు. పిచ్‌పై సిబ్బంది కవర్లు కప్పి ఉంచారు.
మూడో టీ-20: వర్షం కారణంగా టాస్ ఆలస్యం - out field
గయానా వేదికగా విండీస్ - భారత్ మధ్య జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. ఈ కారణంగా టాస్ ఆలస్యమైంది.
టాస్
ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడం వల్ల టాస్ వేసేందుకు అనుకూలించలేదు. రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఈ మ్యాచ్‌లో నెగ్గి క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటోంది. ఇందులో గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది విండీస్.
ఇది చదవండి: పుజారాను వెనక్కి నెట్టిన స్మిత్.. అగ్రస్థానంలో కమిన్స్
Last Updated : Aug 6, 2019, 8:33 PM IST