ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తనను తీసుకున్నందుకు ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ కరన్ ఆనందం వ్యక్తం చేశాడు. సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆలోచనలను వాడుకునే అవకాశం దొరికిందని సంబరపడ్డాడు.
"చెన్నై వచ్చి నా కొత్త సహచరులను కలిసేందుకు ఆత్రుతగా ఉన్నా. అలాగే కెప్టెన్ ధోనీ, కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పర్యవేక్షణలో ఆడాలనే కుతుహలంతో ఉన్నా. వారి తెలివితేటలను, ఆలోచనలను వాడుకునే గొప్ప అవకాశం దొరికినందుకు ఆనందంగా ఉంది. చెన్నైకు మేము కప్పు తీసుకోస్తామని ఆశిస్తున్నా. గతేడాది చెన్నైకు ప్రత్యర్థిగా ఆడా, ఈ ఏడాది సీఎస్కేలోనే ఆడనుండటం అదృష్టంగా భావిస్తున్నా. సొంత అభిమానుల ముందు ఆడటం నిజంగా ప్రత్యేకం." - సామ్ కరన్, ఇంగ్లాండ్ క్రికెటర్.