తెలంగాణ

telangana

ETV Bharat / sports

పైన్​కు సాయం చేద్దామనుకున్నా అంతే: స్మిత్​ - smith chappell

ఎవరిని దిగజార్చే ఉద్దేశం తనకు లేదని ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలపై స్పందించాడు ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్. పైన్​కు సాయపడదామనే ఫీల్డింగ్ విషయంలో అతడికి సలహానిచ్చానని తెలిపాడు.

Only want to help Tim Paine: Steve Smith reacts to Ian Chappell criticism
స్టీవ్ స్మిత్​

By

Published : Dec 3, 2019, 6:44 PM IST

పాకిస్థాన్​తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్​ టిమ్​పైన్​ను దిగజార్చేలా స్టీవ్ స్మిత్ ప్రవర్తించాడని ఆ జట్టు మాజీ సారథి ఇయాన్ చాపెల్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్మిత్ స్పందించాడు. తను కేవలం పైన్​కు సాయం చేద్దామనే ఫీల్డింగ్ విషయంపై సలహాలిచ్చానని అన్నాడు.

"పైన్ తన బాధ్యతను అద్భుతంగా నిర్వర్తిస్తున్నాడు. నేను అతడికి సాయం చేద్దామనే ఫీల్డింగ్ విషయంలో సలహాలిచ్చా. జట్టు బాగు కోసమే అలా చేశా. అతడిని అణగదొక్కాలనో, దిగజార్చాలనో అలా ప్రవర్తించలేదు" - స్టీవ్ స్మిత్, ఆసీస్ క్రికెటర్.

పాక్​తో టెస్టులో స్మిత్.. ఆఫ్ సైడ్ ఫీల్డర్లు సెట్ చేశాడని, అందుకు సంబంధించి టిమ్​పైన్​తో సంభాషించాడని చాపెల్ మ్యాచ్ అనంతరం అన్నాడు. పైన్​ను దిగజార్చేలా స్మిత్ ప్రవర్తిస్తున్నాడని, ఫీల్డింగ్ సెట్ చేస్తూ మైదానం మధ్యలో నడుచుకుంటూ వెళ్లడం తనకు నచ్చలేదని తెలిపాడు.

అడిలైడ్ వేదికగా పాకిస్థాన్​తో జరిగిన ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా.. ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్​ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. డేవిడ్ వార్నర్.. తొలి టెస్టులో శతకంతో పాటు.. రెండో టెస్టులో ట్రిపుల్ సెంచరీ చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కించుకున్నాడు.

ఇదీ చదవండి: ఆర్చర్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది: రూట్

ABOUT THE AUTHOR

...view details