పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్నుఆస్ట్రేలియా.. 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేయడంపై ప్రశంసల వర్షం కురిపించాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. అంతర్జాతీయ క్రికెట్లో కంగారూ జట్టు పూర్వవైభవం తెచ్చుకుంటోందని అన్నాడు. ప్రస్తుతం ఆసీస్‌ను వారి గడ్డపై ఓడించే సత్తా భారత్‌కు మాత్రమే ఉందని ట్వీట్ చేశాడు.
"ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించే సత్తా ఉన్న జట్టు టీమిండియానే. భారత్‌కు అందుకు సరిపడా వనరులు సమృద్ధిగా ఉన్నాయి. ప్రస్తుతం పాక్‌తో జరిగిన టెస్టు సిరీస్ చూస్తేనే ఆసీస్ ఎంత బలంగా ఉందో తెలుస్తోంది" -మైఖేల్ వాన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.
ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో విజయభేరీ మోగించింది టీమిండియా. ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ కైవసం చేసుకొని సత్తాచాటింది. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఈ సిరీస్‌కు వార్నర్, స్మిత్ దూరమయ్యారు.