తెలంగాణ

telangana

ETV Bharat / sports

బంగాల్​ రంజీ క్రికెటర్లకు లక్ష్మణ్​ ఆన్​లైన్​ శిక్షణ! - cricket latest news

బంగాల్​ రంజీ క్రికెటర్లకు, ఆ జట్టు బ్యాటింగ్​ సలహాదారు వీవీఎస్​ లక్ష్మణ్​ ఆన్​లైన్​ ద్వారా పాఠాలు చెప్పనున్నాడు.

Online Cricket Coaching by VVS Laxman to Bengal Ranzi players
బంగాల్​ రంజీ క్రికెటర్లకు లక్ష్మణ్​ ఆన్​లైన్​ శిక్షణ!

By

Published : Apr 19, 2020, 9:28 AM IST

బంగాల్‌ రంజీ క్రికెటర్లకు ఆ జట్టు బ్యాటింగ్‌ సలహాదారు వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పనున్నాడు. గత సీజన్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌ చేసిన తప్పిదాలు గుర్తించి, వాటిని ఎలా అధిగమించాలనే విషయంపై లక్ష్మణ్‌ ఒక్కో ఆటగాడికి ప్రత్యేక సెషన్‌ తీసుకోనున్నాడు. 13 ఏళ్ల తర్వాత, గత సీజన్‌లో తొలిసారి ఫైనల్‌ చేరిన బంగాల్‌.. తుదిపోరులో సౌరాష్ట్ర చేతిలో ఓడింది.

"ఆన్‌లైన్‌ సెషన్స్‌ గురించి మా బ్యాటింగ్‌ సలహాదారు వీవీఎస్‌ లక్ష్మణ్‌తో మాట్లాడా. వీడియో విశ్లేషకుల దగ్గర నుంచి మా బ్యాట్స్‌మెన్‌కు సంబంధించిన క్లిప్పింగ్స్‌, సమాచారం తీసుకుని అతనికి అందిస్తాం. ఆ తర్వాత ఒక్కో ఆటగాడికి.. ఎలా మెరుగవ్వాలో అనే విషయంపై ప్రత్యేక సెషన్‌ ఉంటుంది. ముఖ్యంగా టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌పై ఎక్కువ దృష్టి సారించాం. అలా చేస్తేనే వచ్చే ఏడాది ప్రదర్శన మెరుగవుతుంది"

-అభిషేక్‌ దాల్మియా, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు.

ఇదీ చూడండి : అశ్విన్‌.. మళ్లీ మన్కడింగ్‌ చేస్తావా?

ABOUT THE AUTHOR

...view details