తెలంగాణ

telangana

ETV Bharat / sports

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు పాక్ క్రికెటర్​కు కరోనా - పాక్ క్రికెటర్​కు కరోనా

దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన పాకిస్థాన్ జట్టులోని ఓ క్రికెటర్​కు కొవిడ్ నిర్ధరణ అయ్యింది. మొత్తం 35 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒక్క ఆటగాడికి మాత్రమే వైరస్​ సోకినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇటీవలే కరోనా కారణంగా.. పాక్​ బోర్డు నిర్వహించే పీఎస్​ఎల్​ వాయిదా పడింది.

One Pakistan player tests COVID-19 positive ahead of South Africa tour
సౌతాఫ్రికా టూర్​కు ముందు.. పాక్ క్రికెటర్​కు కరోనా

By

Published : Mar 17, 2021, 5:37 PM IST

దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు పాకిస్థాన్​ జట్టులో ఒక క్రికెటర్​కు కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ధ్రువీకరించింది.

కొద్దిరోజుల ముందే.. కరోనా కలకలంతో పాకిస్థాన్​ సూపర్​ లీగ్​(పీఎస్​ఎల్​) వాయిదా పడింది. ఇప్పుడు.. దక్షిణాఫ్రికా పర్యటనపై సందిగ్ధం నెలకొంది.

"సౌతాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన 35 మంది పాక్​ ఆటగాళ్లకు బుధవారం కరోనా పరీక్షలు నిర్వహించాం. ఒక్కరు​ మినహా మిగతా క్రికెటర్లకు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. కరోనా వచ్చిన ఆటగాడికి మరోమారు పరీక్ష నిర్వహిస్తాం. నెగెటివ్ వస్తే అతడు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తాడు. రెండో దఫా టెస్టుకు ముందు రెండ్రోజులు అతడు ఐసోలేషన్​లో ఉంటాడు."

-పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.

మిగతా జట్టు సభ్యులు శిక్షణ నిమిత్తం లాహోర్​లోని గడాఫీ స్టేడియానికి చేరుకుంటారని పాక్ బోర్డు వెల్లడించింది. అక్కడి నుంచి మార్చి 26న జోహన్నెస్​బర్గ్​కు వెళ్తారని స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికాతో 4 టీ20లతో పాటు 3 వన్డేలు ఆడనుంది పాక్​. అక్కడి నుంచి జింబాబ్వే టూర్​కు వెళ్లనుంది. జింబాబ్వేతో 3 టీ20లతో పాటు 2 టెస్టు మ్యాచ్​లు ఆడనుంది.

ఇదీ చదవండి:చివరి వన్డేలోనూ భారత మహిళల ఓటమి

ABOUT THE AUTHOR

...view details