తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీమిండియా పేస్ విభాగం అత్యద్భుతంగా ఉంది' - ఆస్ట్రేలియా

టీమిండియా పేస్ దళం అత్యద్భుతంగా ఉందని కొనియాడాడు ఆసీస్ మాజీ బౌలర్ గిలెస్పీ. ఫాస్ట్ బౌలర్లు నిలకడగా రాణించడంలో కోహ్లీ కీలకపాత్ర పోషిస్తున్నాడని తెలిపాడు.

bowling
గిలెస్పీ,

By

Published : Jan 4, 2020, 11:37 AM IST

టీమిండియా పేస్ విభాగం బలంగా కనిపిస్తోందని ఇప్పటికే చాలా మంది దిగ్గజ బౌలర్లు చెప్పారు. తాజాగా ఆసీస్‌ మాజీ బౌలర్‌ గిలెస్పీ వారిపై ప్రశంసల జల్లు కురిపించాడు. భారత్‌ పేస్ విభాగం ఎంతో దుర్భేద్యంగా ఉందని అన్నాడు.

"టీమిండియా బౌలింగ్‌ అత్యద్భుతంగా ఉంది. ప్రపంచంలో ఉత్తమ పేస్ దళం వారిదే. ఆస్ట్రేలియా, భారత పేసర్ల బౌలింగ్‌ను ఎంతో ఆస్వాదిస్తాను. మిచెల్‌ స్టార్క్‌, హెజిల్‌వుడ్‌, ప్యాట్‌ కమిన్స్‌ మంచి ఫాస్ట్‌ బౌలర్లు. అయితే జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి జోడీ ఇంకా గొప్పది. భారత పేస్‌ విభాగం ఇంత పటిష్ఠంగా మారడంలో నాకు పెద్దగా ఆశ్చర్యమేమి అనిపించడం లేదు. ఎందుకంటే భారత్‌లో నైపుణ్యమున్న పేసర్లు ఎంతో మంది ఉన్నారు."
-గిలెస్పీ, ఆసీస్ మాజీ బౌలర్

ఫాస్ట్‌ బౌలర్లు నిలకడగా రాణించడంలో సారథిగా కోహ్లీ ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాడని గిలెస్పీ అన్నాడు. జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైని, శార్దూల్‌ ఠాకూర్‌, ఖలీల్‌ అహ్మద్‌తో టీమిండియా అన్ని ఫార్మాట్లలో గొప్ప పేస్‌ దళాన్ని కలిగి ఉంది.

ఇవీ చూడండి.. ఈ దశాబ్దంలో తొలి డబుల్ సెంచరీ లబుషేన్​దే

ABOUT THE AUTHOR

...view details