తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాకిస్థాన్​ జట్టుకు న్యూజిలాండ్​ చివరి హెచ్చరిక - న్యూజిలాండ్​ వర్సెస్​ పాకిస్థాన్​ వార్తలు

నిర్బంధ నియమాలు అతిక్రమిస్తున్న పాక్ క్రికెటర్లు విషయమై కివీస్​ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. అయితే ఎవరు బయట తిరిగారు అనే విషయం మాత్రం వెల్లడించలేదు. ఈ పర్యటనలో భాగంగా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనున్నాయి ఇరుజట్లు.

One more rule breach, NZ will send us back to Pakistan: PCB CEO to players
పాకిస్థాన్​ జట్టుకు న్యూజిలాండ్​ చివరి హెచ్చరిక

By

Published : Nov 27, 2020, 11:17 AM IST

Updated : Nov 27, 2020, 11:33 AM IST

న్యూజిలాండ్​ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్​ క్రికెటర్లు క్వారంటైన్​ నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఈ సందర్భంగా కివీస్ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చివరి హెచ్చరిక చేసింది.

వివరాలు చెప్పేందుకు నిరాకరణ

సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా పలువురు పాక్ క్రికెటర్లు నిర్బంధ నియమాలను అతిక్రమించి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆటగాళ్ల వివరాలు వెల్లడించేందుకు న్యూజిలాండ్​ ఆరోగ్య శాఖ నిరాకరించింది.

పాక్​ బృందం క్రైస్ట్​చర్చ్​లోని పార్క్​ హోటల్​లో బస చేస్తోంది. మొత్తం 53 మందిలో ఆరుగురికి కరోనా పాజిటివ్​గా తేలింది. మిగిలిన వారందరికి నెగటివ్​ రావడం వల్ల.. వైరస్​ సోకిన వారిని ఐసోలేషన్​లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

శిక్షణకు అనుమతి రద్దు

కాంటర్బరీ జిల్లా హెల్త్ బోర్డు ఆరోగ్య అధికారి పాకిస్థాన్ మేనేజ్​మెంట్​కు ఓ లేఖ రాశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఆటగాళ్లందరూ తమ గదుల్లోనే ఉండాలని అందులో పేర్కొన్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు వారికి శిక్షణ ఇచ్చే అధికారాన్ని కూడా రద్దు చేశారు.

ఇదీ చూడండి... ఆరుగురు పాకిస్థాన్​ క్రికెటర్లకు కొవిడ్ పాజిటివ్

Last Updated : Nov 27, 2020, 11:33 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details